నేను మీ పని మనిషిని కాదు !

Telugu Lo Computer
0


బీహార్ లోని పాట్నాలో దిఘా ఘాట్ వద్ద గంగానదిలో చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ నిర్వహించింది. నవంబర్ 30న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ కు, మేజిస్ట్రేట్ కు మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈవెంట్ భద్రత కోసం ఉదయం నుంచి పోలీసులు అక్కడ మోహరించారు. కార్యక్రమానికి మేజిస్ట్రేట్ విపి గుప్తా వచ్చారు. కార్యక్రమం ప్రారంభమయ్యే ముందుకు మంచి నీరు తీసుకురావాలని మేజిస్ట్రేట్, ఓ మహిళా కానిస్టేబుల్ ను కోరాడు. అప్పటికే కనీసం టిఫిన్ కూడా చేయని పోలీస్ సిబ్బంది ఆకలితో ఉన్నారు. ఈ క్రమంలో మంచి నీరు తెమ్మని మేజిస్ట్రేట్ చెప్పడంతో మహిళా కానిస్టేబుల్ తిరస్కరించడంతో వివాదం తలెత్తింది. మేజిస్ట్రేట్ ను ప్రశ్నిస్తూ నేను ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకు మంచి నీరు తీసుకురావాలి.. నీ సేవకురాలని కాదు అని జవాబు ఇచ్చింది. దీంతో వివాదం నెలకొంది. పోలీసులంతా కూడా ఆమెకు అండగా నిలిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో  ఇలా రాసింది. మేము వారి సేవకులమా? మేం ప్రభుత్వ సేవకులం. అతనికి వ్యక్తిగత సేవకుడు ఉన్నారు కదా. మేం ఉదయం నుంచి అల్పాహారం చేశామా అని అడిగారా.. మమ్మల్ని నీరు అడుగుతున్నారు. అప్పుడు మా ముఖం చూశాడా అని ప్రశ్నిస్తూ రాసింది మహిళా కానిస్టేబుల్. నేను నీరు అడగడం ప్రాథమిక మానత్వాన్నికి సంబంధించిన విషయం. మంచి నీరు అడిగితే ఎవరైనా ఇస్తారు. నేను కూడా ఇంటినుంచి చాలా బాటిళ్లలో నీరు తెచ్చాను. అందరికీ ఇచ్చాను. ఇది ఆమె వ్యక్తిగత ప్రతిష్ట కు భంగం కలిగినట్లు అనుకుంటే డీఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మేజిస్ట్రేట్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)