ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి తప్పిన పెను ప్రమాదం !

Telugu Lo Computer
0


రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్ పోర్టులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో నంబర్ 39 పోల్ ను విమానం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు.. వాతావరణం బాగాలేక.. విజువల్ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పొగమంచు ఆవరించింది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వాతావరణం సరిగా లేకపోవడంతో విజువాలిటీ తక్కువగా ఉండటంతో ఢిల్లీకి వెళ్లే 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్ సర్ లకు మళ్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల మధ్య సమయంలో 20 విమానాలను మళ్లించినట్లు తెలిపారు. మొత్తం 13 విమానాలు జైపూర్ కు, అహ్మాదాబాద్, లక్నోలకు ఒక్కొక్కటి చొప్పున, 4 విమానాలు అమృత్ సర్ కు మళ్లించారు. ఈ మేరకు విమానాల దారి మళ్లింపుపై ఎక్స్ లో పోస్ట్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)