ట్రైన్‌లో యువతితో స్టెప్పులేసిన హోంగార్డు !

Telugu Lo Computer
0


ముంబయిలో కదులుతున్న ట్రైన్‌లో ఓ యువతితో హోంగార్డు ఎస్ ఎఫ్ గుప్తా స్టెప్పులేసిన వీడియో బయటకు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. saiba__19 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో కదులుతున్న ట్రైన్‌లో ఓ యువతి స్టెప్పులు వేయడం ప్రారంభించింది. ఆమెను హెచ్చరించాల్సిన పోలీసు సైతం స్టెప్పులు వేయడం ప్రారంభించారు. ముంబయి సెంట్రల్ రైల్వే లోకల్ ట్రైన్ సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో డిసెంబర్ 6 న ఈ ఘటన జరిగింది. అప్పుడు సమయం రాత్రి పది గంటలుగా తెలుస్తోంది. ఆ సమయంలో మహిళల భద్రత కోసం కేటాయించబడిన హోంగార్డు గుప్తా విధుల్లో ఉండి ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది. గుప్తా డ్యాన్స్ చేస్తున్న వీడియో డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారిక ఖాతా నుండి ఆర్పీఎఫ్  కు ట్యాగ్ చేశారు. ఆర్పీఎఫ్  దీనిని గుర్తించడంతో విషయం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వే పోలీసులు డిసెంబర్ 8 న గుప్తాను వివరణ కోరుతూ నోటీసు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ రైల్వే పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)