క్యాంటీన్‌లో సీటు కోసం లాయర్ల మధ్య ఘర్షణ !

Telugu Lo Computer
0


ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో సీటు కోసం లాయర్లు కొట్టుకున్నారు. లాయర్ల మధ్య జరిగిన ఘర్షణతో క్యాంటీన్‌లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. భోజనం చేస్తున్న ఇతర లాయర్లు ఇబ్బంది పడ్డారు. ఓ లేడీ సీనియర్ అడ్వకేట్‌ను మరో మహిళా లాయర్ చెంపపై కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. భోజనానికి వచ్చిన లాయర్ల వద్దకు ఓ లేడీ లాయర్ దూసుకువచ్చి గొడవ పెట్టుకుందని అన్నారు. ఆమెకు సర్ది చెప్పేందుకు కొందరు సీనియర్ లాయర్లు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ లేడీ లాయర్ వినిపించుకోలేదు. టేబుళ్లపై ఉన్న ఆహార పదార్థాలను ఆమె చెల్లాచెదురు చేశారు. ఓ లాయర్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జరిగిన గొడవ గురించి చెప్పారు. భోజనం చేస్తున్న వారంతా ఈ గొడవ సమయంలో నిలబడాల్సి వచ్చింది. లాయర్లు గొడవ పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)