పోస్టాఫీస్‍లో కొరియర్ సేవలు !

Telugu Lo Computer
0


ప్రైవేట్ కొరియర్లతో పోటీ పడేందుకు పోస్టాఫీస్ సిద్ధమైంది. క్లిక్ ఎన్ బుక్ అనే పేరుతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్ లో కొత్తగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్లిక్ ఎన్ బుక్ ద్వారా కస్టమర్‌లు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్‌లు, పార్సెల్‌లను ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చని పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ సేవ హైదరాబాద్‌లో 107 పిన్ కోడ్‌లలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుని కస్టమర్ ఫ్రెండ్లీగా, హై-టెక్ సర్వీసులను అందించడానికి ప్రయత్నం చేస్తోందని వివరించారు. క్లిక్ ఎన్ బుక్ సర్వీస్ దేశంలో మొదటగా ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాలోని ప్రయాగ్రాజ్, కచ్చరీ హెడ్ పోస్టు ఆఫీసుల్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఈ సేవలు ప్రారంభించారు. ఈ కొరియర్ సర్వీస్ తో వినియోగదారులు గరిష్ఠంగా 5 కిలోల వరకు కొరియర్ చేయవచ్చు. ఈ సేవలు పొందేందుకు www.indiapost.gov.in లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి. కస్టమర్లు రూ.500 వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే.. పోస్టల్ డిపార్ట్‌మెంట్ మీ పోస్టులను, లేదా పార్సెల్‌లను పూర్తి ఉచితంగా పికప్ చేసుకుంటారని అధికారులు తెలిపారు. ఒక వేళ మీరు చెల్లించిన బుకింగ్ ఛార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే రూ.50 వరకు పికప్ ఛార్జీల కింద వసూలు చేయనున్నారు. అయితే ఈ సేవలు ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేయవు. 

Post a Comment

0Comments

Post a Comment (0)