చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తున్న 'వైట్‌ లంగ్‌' !

Telugu Lo Computer
0


మెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్‌ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌ చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తున్నది. 3-8 ఏండ్ల మధ్య వయసు చిన్నారులకు ఈ వ్యాధి సోకుతున్నది. అయితే ఈ వ్యాధికి చైనాకు సంబంధం లేదని నిపుణులు చెప్పారు. బాధితుల ఊపిరితిత్తులను స్కాన్‌ చేసినపుడు తెలుపు రంగు మచ్చలు కనిపిస్తుండటంతో దీనిని వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌ అని పిలుస్తున్నారు. దగ్గు, తుమ్ములు, సంభాషణలు, ఊపిరి తీసుకుని, వదిలేటపుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్లు తెలుస్తున్నది. బాధితులు జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, అలసట వంటివాటితో బాధపడుతూ ఉంటారు. ఓహియోలోని అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ బ్యాక్టీరియల్‌ న్యుమోనియా బాధితుల్లో చాలా మందికి యాంటీ బయాటిక్స్‌ ఇవ్వడం వల్ల నయమైనట్లు తెలిపారు. చాలా మంది దవాఖానలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)