20 ఏళ్ల క్రితం కూడా ఇలానే జరిగింది !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ.. 20 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో కేవలం ఢిల్లీలో మాత్రమే గెలిచామని తెలిపారు. కానీ, కొన్ని నెలల్లో జరిగిన 2004 లోక్‌సభ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈసారి కూడా అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఆశావహ ధృక్పథంతో, దృఢ సంకల్పంతో సన్నద్ధమవుతామని తెలిపారు. తాజాగా వెలువడిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా మూడింట్లో విజయం సాధించింది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ భాగస్వామ్యంలోని ఇండియా కూటమి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఉండబోవనే అభిప్రాయం కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)