హైటెక్ హరిదాసు !

Telugu Lo Computer
0


సంక్రాంతి పండగ అంటే ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ గుర్తుకొస్తుంది. పంట ఇంటికి రావడంతో దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి పండగ సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలతో రోజూ పండగ సందడిని ప్రతి ఒక్క ఇంటికి తీసుకొస్తుంది. గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో హరినామ సంకీర్తన చేస్తూ గ్రామ గ్రామాన భిక్షాటన చేస్తారు. ధనుర్మాసం రావడంతోనే హరిదాసు సందడి మొదలయింది. హరిదాసు చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిరునామంతో హరిలో రంగ హరి అంటూ కీరిస్తూ ఇంటింటికి చేరుకుంటారు. ఈ మాసంలో చేసే దానధర్మాలను అందుకుని ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని హరిదాసులు దీవిస్తారు. నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసి.. సంక్రాంతి రోజున స్వయంపాకం తీసుకుని ప్రజలను దీవిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు హరిదాసుల గమనంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నడుచుకుంటూ ఇంటి ఇంటికి చేరుకునే హరిదాసులు ఇప్పుడు హై టెక్ పద్దతులను పాటిస్తున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో అమలాపురంలో హైటెక్ హరిదాసులు సందడి చేస్తున్నారు. సాధారణంగా హరిదాసు నెత్తిపై కంబలి పెట్టుకుని నడుచుకుంటూ ఇంటింటా తిరుగుతూ హరి రామ సంకీర్తనలు ఆలపిస్తారు. కాలానికి అనుకూలంగా వచ్చిన మార్పుల్లో భాగంగా హైటెక్ హరిదాసులు వస్తున్నారు. మోటర్ బైక్లపై హైటెక్ హరిదాసులు, డీజే సౌండ్ చేస్తూ ఇంటింటా తిరుగుతూ స్వయంపాకం అందుకుంటున్నారు. హైటెక్ హరిదాసులు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)