తగ్గిన బంగారం ధరలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1090 తగ్గింది. 22 క్యారెట్ల 10 బంగారం ధరపై రూ. 1000 తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ సిల్వర్ రేట్ రూ. 2100 తగ్గి రూ.81,400కు చేరింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1090 తగ్గడంతో రూ. 63,110 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1000 తగ్గడంతో రూ. 57850 కి చేరింది. విశాఖ,విజయవాడలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్‌ డిమాండ్ బాగుందని జ్యుయెలర్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది మధ్యలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు బాండ్లు, ఎఫ్‌డీలు వంటి అసెట్స్‌పై తక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫలితంగా గోల్డ్‌ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారని కేసీఎం ట్రేడ్ ఎనలిస్ట్‌ టిమ్‌ వాటెరర్ పేర్కొన్నారు. కాగా, ఫెడ్ చైర్మన్ తాజా స్పీచ్‌లో పాలసీని కఠినం చేయమని, అలా అని సులభం కూడా చేయమని అన్నారు. దేశంలో గోల్డ్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)