సోనియా గాంధీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ 77 వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కాంగ్రెస్ నాయకులు ఖర్గే , ప్రధాని మోడీ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సుదీర్ఘ కాలం ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈమేరకు తన సందేశాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా నివాసానికి వెళ్లి కలుసుకుని తన శుభాకాంక్షలు తెలిపారు. సోనియాను కలుసుకున్న తరువాత కాంగ్రెస్ కార్యకర్తల తరఫున ఎక్స్ పోస్ట్‌లో శుభాకాంక్షలు పంపించారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఆమె ధైర్యంతో మహాన్నత గౌరవంతో అందించిన త్యాగం, సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగిస్తాయని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం సాగిస్తూ, నిస్వార్థ త్యాగానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)