కడసారి చూసేందుకు తరలివచ్చిన భారీ జనసందోహం !

Telugu Lo Computer
0


ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్‌ విజయకాంత్‌ పార్థివ కాయాన్ని  కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులేగాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల తండోపతండాలుగా తరలివస్తున్నారు. విజయకాంత్‌ పార్థివదేహాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు ఏరియాలోగల డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఉంచడంతో అక్కడ భారీ జనసందోహం నెలకొంది. డీఎండీకే పార్టీ కార్యాలయం లోపల, బయట, రోడ్లపైన, ఫ్లైవోవర్ల మీద జనం కిక్కిరిసిపోయారు. కాగా, శ్వాస సంబంధ సమస్యతో చెన్నైలోని మియోట్‌ ఆసుపత్రిలో చేరిన విజయకాంత్‌కు వైద్య పరీక్షల్లో కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌ పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)