హిమాచల్‌ప్రదేశ్‌లో అగ్నికి ఆహుతైన ఐదు వేల కోళ్లు !

Telugu Lo Computer
0


హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పౌల్టీఫారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి సుమారు 5 వేల కోళ్లు అగ్నికి ఆహతైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి జరగగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫారంలో దాదాపు 12 వేల కోళ్లు ఉన్నాయని వారు తెలిపారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ఫారం యజమాని జగ్తార్ సింగ్ తెలిపారు. కొత్త సంవత్సరం నేపథ్యం ఆదాయం వస్తుందని ఆశతో ఉన్నామని, ఈ ప్రమాదంతో ఆశలు అడియాశలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)