యువ రాజకీయ నేతలకు మార్గం సుగమం చేయడాన్ని నమ్ముతా !

Telugu Lo Computer
0


రానున్న లోక్‌సభ ఎన్నికలే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ అంటూ సంకేతాలు పంపారు. యువ రాజకీయ నేతలకు మార్గం సుగమం చేయడాన్ని తాను నమ్ముతానని అన్నారు. అయితే రాజకీయ కెరీర్‌లో ఎప్పుడూ ఊహించనవి జరుగుతుంటాయని అంగీకరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తిరువనంతపురం ప్రజలకు 20 ఏండ్ల సేవలు పూర్తవుతాయని అప్పుడు సంతోషంగా తప్పుకుంటానని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఇదే ఖరారని చెప్పలేమని, ఎలాంటి పరిస్ధితులు ఉత్పన్నమవుతాయో ఎవరికి తెలుసని అన్నారు. తిరువనంతపురం నుంచి తాను పోటీ చేయడంపై అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటిస్తేనే తాము పనిచేసుకుంటామని వెల్లడించారు. తిరువనంతపురంలో తనపై బీజేపీ ఓ జాతీయ నేతను బరిలో దింపుతుందనే వార్తలపై స్పందిస్తూ కాషాయ పార్టీ సవాల్‌ను స్వీకరిస్తానని ప్రజలే మెరుగైన అభ్యర్ధిని ఎన్నుకుంటారని అన్నారు. 15 ఏండ్లుగా నియోజకవర్గానికి తాను చేసిన సేవలనే ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తానని చెప్పారు. ఎవరిని గెలిపిస్తారనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడిఉంటుందని శశి థరూర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)