తమిళనాడులో భారీ వర్షాలు !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరునెల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలతో సహా దక్షిణ ప్రాంతాల్లో ఆదివారం భారీవర్షం కురిసింది. దీంతో డ్యాంలన్నీ నిండుకుండలా మారాయి. తిరునెల్వేలీ నగరం, రూరల్ తిరునల్వేలి ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో తిరునల్వేలీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని వీధుల్లో ఎక్కడికక్కడి వరదనీరు భారీగా వచ్చి చేరింది. తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశం , మణిముత్తర్ డ్యామ్ లలో నీటి మట్టం భారీగా పెరిగింది. పాపనాశం డ్యామ్ లో 80 శాతం, మణిముత్తర్ డ్యామ్ లో 45 శాతం నిండాయి. తామిర బరణి నది పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసిన కారణంగా ఆకస్మిక వరద రావడంతో నీటిమట్టం వేగంగా పెరిగింది. ఈరోజు కురిసిన వర్షాలకు పశ్చిమ కనుమల్లోని మంజోలై కొండల్లోని ఊతు లో 169 మి.మీ, కక్కాచి 150 మి.మీ, మంజోలై లో 135 మ.మీ వర్షపాతం నమోదైంది. మంజోలై హిల్స్ లోని నాలుగు ముక్కులో 190 మిమీ వర్షపాతం నమోదైంది. ఇది తమిళనాడులో అత్యధిక వర్షపాతం. తామిర బరణి నది ఒడ్డున నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తిరునెల్వేలీ జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)