నిద్రను దూరం చేస్తున్న సెల్‌ఫోన్‌ !

Telugu Lo Computer
0


దయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటుంది. విచ్చలవిడిగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట అతిగా స్మార్ట్​ఫోన్ వాడితే, నిద్ర దూరం కావడమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం వాడే స్మార్ట్‌ఫోన్‌ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఫోన్​ స్క్రీన్​ నుంచి వచ్చే బ్లూ లైట్​కి ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మీరు ఫోన్​లో ఈ-మెయిల్స్ తనిఖీ చేయడం, సోషల్ మీడియా సైట్‌లను వీక్షించడం, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుంటే దృష్టంతా వాటిపైనే యాక్టివ్​గా ఉంటుంది. దాంతో  తగిన నిద్ర పోవడానికి అవకాశం ఉండదు. ఇది నిద్ర లేకుండా చేయడమే కాదు, నిద్రలో కూడా ఇది ఇబ్బంది కలిగిస్తుందట.  ప్రశాంతంగా ఉండేవారికి త్వరగానే నిద్ర వచ్చేస్తుంది. ఒత్తిడిలో ఉండే వారికే.. సరిగా నిద్ర రాదు. ఇలాంటి వారు ఫోన్​తో కాలక్షేపం చేస్తుంటారు. దీంతో.. నిద్ర మరింత దూరమవుతుంది. ఫలితంగా.. అప్పటికే ఉన్న ఒత్తిడి స్థాయి మరింత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా.. సోషల్ మీడియా​లో ఎవరితోనైనా చాట్ చేస్తున్నా.. ఏదైనా నెగెటివ్ అంశంపై డిస్కస్ చేస్తున్నా.. మీ మెదడుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది నిరంతరం కొనసాగితే మానసిక సమస్యగా మారే అవకాశమూ ఉంటుంది. ఎక్కువసేపు స్మార్ట్​ఫోన్​ని ఉపయోగించినప్పుడు కళ్లు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా నైట్ లైట్లు ఆఫ్ చేసి.. ఫోన్ చూస్తున్నట్టయితే.. కళ్లకు మరింత పని పెట్టినవారవుతారు. దీంతో ఫోన్ స్క్రీన్​ నుంచి బ్రైట్​గా కనిపించే ఆ బ్లూ లైట్​ చూస్తూ.. కళ్లు పగటివేళ కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో.. కళ్లపై మరింత ప్రెజర్ పెరుగుతుంది. ఫలితంగా కళ్లు పొడిబారడం, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు లాంగ్​ టైమ్​ కొనసాగితే చాలా ఇబ్బందులు వస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)