బీహార్‌లో డిఎంసిహెచ్ వైద్యుల మందు పార్టీ !

Telugu Lo Computer
0


బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (డిఎంసిహెచ్) వైద్యుల మందు పార్టీ చేసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైద్యుల మద్యం పార్టీ చేసుకుంటున్న సమాచారంతో.. SSP అవకాష్ కుమార్ ఆదేశాల మేరకు సదరు SDPO అమిత్ కుమార్ నేతృత్వంలో అతిథి గృహంలో దాడి చేశారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. డాక్టర్లు మద్యం పార్టీ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. స్థానిక వైద్యులతో పాటు, బయటి నుండి వచ్చిన చాలా మంది వైద్యులు కూడా మద్యం సేవిస్తున్నట్లు కనిపించారు. ఈ అంశంపై ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. దర్బంగా మెడికల్ కళాశాల అతిథి గృహంలో దాడులు నిర్వహించగా, గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురు సీనియర్ వైద్యులు సైతం మద్యం సేవించినట్లు వీడియోలో ఉన్నట్లు చెప్పారు. ఈ వీడియోపై విచారణ జరుగుతోంది.. దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ తెలిపారు. మాజీ ఎంపీ, జాప్‌ అధినేత పప్పు యాదవ్‌ సోషల్‌ మీడియాలో మద్యం పార్టీ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)