దళిత మహిళపై సామూహిక అత్యాచారం !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా దేవా ప్రాంతంలో దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన కారణంగా నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం భర్తతో గొడవపడి అత్తమామల ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తన పుట్టింటికి వెళుతుండగా, మొఘల్ ఆజం అలియాస్ రియాజ్, అష్రఫ్ అలియాస్ భురే, షబ్బు, ఇస్లాముద్దీన్ అనే నలుగురు వ్యక్తులు ఆమెను ఒక కారులో డ్రాప్ చేయడానికి ముందుకొచ్చారని, ఆమె కారులో ఎక్కకపోయేసరికి  బలవంతంగా కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు కట్టేసి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, నిందితులందరినీ అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ సీఎన్ సిన్హా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)