నల్ల వెల్లుల్లి - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0

నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది కూడా ఒక సాధారణమైన వెల్లుల్లే. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది. మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి దీనిని తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియ ద్వారా నల్ల వెల్లుల్లిని తయారు చేస్తారు. దీనిలో జరిగే మెయిలార్డ్ ప్రతి చర్య, కారమెలైజేషన్ కారణంగా వెల్లుల్లి రుచి, వాసన, ఘాటు తగ్గుతుంది. వీటిలో వెల్లుల్లిలో ఎస్ అల్లైల్ సిస్టీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రాణాంతర వ్యాధులతో ఇది పోరాడుతుంది. నల్ల వెల్లుల్లిని సలాడ్స్, సూప్స్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు. ఇది తీయ్యగా ఉంటుంది. అలానే నమిలి కూడా తినవచ్చు. రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)