నిజ్జర్ హత్య కేసులో నిందితుల అరెస్టు ?

Telugu Lo Computer
0

లిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్టు చేయనున్నారని, నిందితులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నారని సమాచారం. నిజ్జర్ హత్య తర్వాత హంతకులు కెనడాను విడిచిపెట్టలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెలల తరబడి పోలీసుల నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. కెనడా సర్రేలోని గురుద్వారాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను ఈ ఏడాది జులై 18న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించారు. ఇది కాస్త భారత్-కెనడా వివాదంగా మారిపోయింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైన విషయం కాదని తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు భారత్ బాధ్యత వహించాలని కెనడా డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేసింది. ఇరుదేశాలు వీసాలపై నిబంధనలు విధించుకునే స్థాయికి వెళ్లాయి. ఇటీవలే కెనడా వీసాల రద్దును భారత్ సడలించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)