ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయ్ !

Telugu Lo Computer
0

త్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండాలు సీఎంను ఖరారు చేశారు. మొత్తం 90 అసెంబ్లీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ గెలిచింది. గతంలో విష్ణు దేవ్ సాయ్ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి విష్ణు దేవ్ సాయ్ గెలుపొందారు. 87,604 ఓట్లతో విజయం సాధించారు. గిరిజన వ్యక్తిని సీఎంగా బీజేపీ ఎన్నుకుంటే.. తొలి ఛాయిస్ విష్ణు దేవ్ సాయ్ అని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయననే సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. సాయ్ మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో ఉక్కు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)