ఈ కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది !

Telugu Lo Computer
0


రైలులో ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని లేదా వేలాడుతూ కొందరూ వ్యక్తులు కనిపిస్తుంటారు. ప్రమాదకరమైన సరే లెక్కచేయకుండా అలానే వేలాడుతూ లేదా కూర్చొని ఉంటారు. అధికారుల చెప్పిన వాళ్ల తీరు మాత్రం మారదు. ముఖ్యంగా యువకులే ఎక్కువగా అక్కడ తచ్చాడుతూ ఉండేది. అయితే ఈ కుక్క అలా ఫుట్‌బోర్డ్‌ మీద కూర్చొవద్దంటూ సదరు ప్యాసింజర్లను హెచ్చరిస్తూ తన భాషలో మొరుగుతూ చెబుతోంది. అలా ఆ ట్రైయిన్‌ బోగీలు కదులుతున్న వరుసకు తాను కూడా ఫాలో అవ్వతూ అలా ఫుట్‌ బోర్డ్‌ మీద కూర్చొని ఏ ప్యాసింజర్‌ కనిపించినా చాలు "పో లోపలకి" అన్నట్లు మొరిగి హెచ్చరించింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఆర్‌ఏఎస్‌ అధికారి అనంత్‌ రూపనగుడి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఫుట్‌బోర్డ్‌పై కూర్చొని ప్రయాణిచడం ఎంత ప్రమాదకరం అని ఆ కుక్క అప్రమత్తం చేస్తున్న తీరుని చూసి అయినా మార్పు వస్తే బావుండనని అని ఆయన క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. అయితే ఆ కుక్క ఇలా వింతగా ప్రవర్తించడానికి గల కారణాలేంటిన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు మాత్రం ఆ కుక్కకు సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తే బావుండనని కోరగా, మరికొందరు మాత్రం బహుశా ఫుట్‌ బోర్టుపై ప్రయాణం ప్రమాదం అని చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం కాబోలు అని కామెంట్లు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)