పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి ?

Telugu Lo Computer
0


పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తె ఆరు గ్యారెంటీల అమలు పరిస్థితి ఎంటి ? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఆరు గ్యారెంటీ లలో మొత్తం 13 హామీలు ఉన్నాయని, ఇప్పటికీ 2 హామీలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని అన్నారు. ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ల అమలు కోసం మార్గదర్శకాలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే కాంగ్రెస్ సర్కార్ ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరి మూడవ వారం లోపు అరు గ్యారెంటీలను అమలు చేస్తే కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉన్నట్టు లేక పోతే ఎగవేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుందన్నారు. వడ్లకి బోనస్ ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు గైడ్ లైన్స్ ఇస్తే యాసంగి లో అయినా  రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు నిధుల విషయములో ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత లేదన్నారు. దాటవేత, ఎగవేత, కోతలకు కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తాం అన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే మే చివరి వారం వరకు ఎన్నికల కోడ్ ఉంటుందన్నారు. బడ్జెట్ పూర్తి స్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నదని ప్రజల్లో ఉందన్నారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితే ఈ స్కీమ్ కు ఎంత నిధులు పెడతారు అని తేలే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ఆరు గ్యారెంటీ లు అమలు చేయాలనీ, కాంగ్రెస్ సర్కార్ కు ఉంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టాలన్నారు. మేము ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వం. పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నామన్నారు. స్కీమ్ లకు గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్ లు తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని హరీష్ రావు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)