మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఫలితాలు నిరాశపరిచాయి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పార్టీకి లభించిన ఫలితాలు నిరుత్సాహ పరిచాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి పట్ట కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని ఆయన అంటూ లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.' తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పార్టీకి ఓటు వేసిన వారికి కూడా కృతజ్ఞతలు. ఈ మూడు రాష్రాల్లో ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహ పరిచాయి. అయితేఈ మూడు రాష్ట్రాల్లో మేము శక్తివంచన లేకుండా పనిచేసి తిరిగి పుంజుంటాం' అని ట్విట్టర్ వేదికగా ఖర్గే అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)