మూఢ నమ్మకానికి శిశువు బలి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లా బంధ్వా గ్రామంలో నెలన్నర రోజుల కిందట పుట్టిన శిశువుకు న్యూమోనియా సోకింది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆ పసి బిడ్డ రోగం నయం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. మూఢ నమ్మకంతో కాల్చిన ఇనుప రాడ్‌తో శిశువు శరీరంపై వాతలు పెట్టారు. కాగా, కాలిన గాయాలైన పసి బిడ్డ అనారోగ్యం మరింతగా క్షిణించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు డిసెంబర్‌ 21న జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)లో ఉంచి చికిత్స అందించినట్లు డాక్టర్‌ జీఎస్‌ పరిహార్ తెలిపారు. అయితే శుక్రవారం ఆ పసి బాబు మరణించినట్లు ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)