రిపబ్లిక్ డే వేడుకకు జో బైడెన్ రావాడంలేదు !

Telugu Lo Computer
0


భారతదేశంలో వచ్చే నెలలో జరిగే గణతంత్ర దినోత్సవం వేడుకలకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ హాజరుకావడం లేదు. ఆయన ప్రధాన అతిధిగా వస్తారని ముందుగా అధికారిక ప్రకటన వెలువడింది. సెప్టెంబర్‌లో ఇండియాలోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెటీ ముందుగా జో బైడెన్ గెస్ట్‌గా రానున్నారని, ప్రధాని మోడీ ఆయనను ఆహ్వానించారని తెలిపారు. దీనిపై భారత అధికార వర్గాలు ఎటువంటి నిర్థారణ చేయలేదు. ఇప్పుడు బైడెన్ రిపబ్లిక్ డే వేడుకకు రావడం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. అదే విధంగా జనవరిలో జరగాల్సిన నాలుగుదేశాల క్వాడ్ సదస్సును కూడా వాయిదా వేశారు. దీనిని ఆ తరువాత నిర్వహిస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)