థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుంది !

Telugu Lo Computer
0


నంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 'చీకూ యాదవ్' అనే పిల్లాడు తన తండ్రితో మహీంద్రా థార్‌ను 700 రూపాయలకు కొనుగోలు చేయడం గురించి మాట్లాడాడు. మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 700 రెండూ ఒకేలాగా ఉన్నాయని, వాటిని రూ.700 లకే కొనుగోలు చేయవచ్చని వాదించాడు. ఈ వీడియో ఎక్స్ (ట్విటర్) వేదికగా బాగా వైరల్ అయింది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ చీకూ వీడియోలను చాలానే చూసాను, ఇప్పుడు అతడంటే ఇష్టం ఏర్పడింది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే  థార్‌ను 700 రూపాయలకు విక్రయిస్తే మేము త్వరలో దివాళా తీయాల్సి ఉంటుందని అన్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే.. వేలమంది వీక్షించారు, కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. చీకూ అమాయకత్వానికి చాలా మంది ముగ్దులైపోయారు. మరికొందరు చీకు మాటలు నిజమవుతాయని సమర్ధించారు. లక్షల విలువైన కారు కేవలం వందల రూపాయలకే కొనుగోలు చేయవచ్చనే అమాయకత్వం చాలా మందిని ఆకర్షించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)