దుకాణాల సైన్‌బోర్డుల్లో 60% కన్నడలో ఉండాల్సిందే !

Telugu Lo Computer
0


బెంగళూర్‌లోని అన్ని దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సంబంధించిన సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడ భాషలోనే ఉండాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి అన్ని సైన్ బోర్డులపై 60 శాతం కన్నడ నిబంధనలు పాటించని దుకాణాలు, హోటళ్లు, మాల్స్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది. బెంగళూర్ నగరంలో సైన్ బోర్డులపై కన్నడ భాష వినియోగానికి సంబంధించి నిబంధనలు పాటించని దుకాణాలను నోట్ చేయడానికి సర్వే చేపట్టనున్నారు. ఇటీవల చిక్‌పేటలో మార్వాడీ వ్యాపారులు, కన్నడ అనుకూల వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ తర్వాత బెంగళూర్ పౌర అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించని వారు తమ ట్రేడ్ లైసెన్సులు కోల్పోతారని హెచ్చరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)