జనవరి 6న ఎల్‌ఎ పాయింట్‌కు ఆదిత్యా ఎల్ 1

Telugu Lo Computer
0


నవరి 6న ఆదిత్యా ఎల్ 1 నిర్ణీత మజిలీని చేరుతుంది. భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంగియన్ పాయింట్ ( ఎల్ 1) నుంచి ఆదిత్యా ద్వారా సూర్యమండల పరిశీలన, పలు కీలక విషయాలపై పరిశోధన లక్షంగా పెట్టుకున్నారు. నిర్ణీత మజిలీకి ఆదిత్యా ఎల్ 1 చేరుకునే తేదీ గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం ఇక్కడ తెలిపారు. భారతదేశపు తొట్టతొలి అంతరిక్ష ప్రాతిపదిక ప్రయోగశాల అయిన ఆదిత్యా ఎల్ 1ను సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు నిర్ణీత దూరాన్ని ఈ నౌక చేరుకోనుంది. ఎటువంటి అయస్కాంత క్షేత్ర ప్రభావం లేని హాలో ఆర్బిట్ ఎల్ 1 నుంచి సూర్యుడి వలయాలు గురించి పరిశోధనలను ఈ నౌక సాగిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)