లిఫ్టు కూలి ఎరాస్మిత్ టెక్నాలజీ ఉద్యోగులకు గాయాలు

Telugu Lo Computer
0


నోయిడా సెక్టార్ 125లో బహుళ అంతస్తుల రివర్ సైడ్ టవర్ లిఫ్టు కూలి, తొమ్మిది మంది ఐటి ఉద్యోగులు గాయపడ్డారు. 8వ అంతస్తు నుంచి ఈ లిఫ్టు కూలిందని, ఇందులోని మొత్తం తొమ్మిది మందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. ఎరాస్మిత్ టెక్నాలజీ సంస్థలో ఉద్యోగులు తెల్లవారుజామున తమ విధులు ముగించుకుని బయటకు వస్తుండగా ఈ లిఫ్టు ప్రమాదం జరిగింది. తీవ్రస్థాయి గాయాలు అయిన ఐదుగురిని వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాధమిక చికిత్స జరిపారు. ఈ ఐటి కంపెనీ ఈ భవనంలో ఎనిమిదవ అంతస్తులో ఉంది. గాయపడ్డ వారిలో ఎవరికి ఎటువంటి ముప్పులేదని నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరీష్ చందర్ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్షంగా వ్యవహరించారని పేర్కొంటూ ఇద్దరు లిఫ్టు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు హరీష్ వివరించారు. నోయిడాలోని బహుళ అంతస్తుల భవనాలలో లిఫ్టులు కూలడం, పలువురు గాయపడటం ఇప్పుడు సాధారణం అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)