2 లక్షల మంది మహిళలతో 'స్త్రీ శక్తి సంగమం' !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించినందుకు కృతజ్ఞతగా ప్రధాని మోడీని అభినందిస్తూ కేరళ భాజపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 'స్త్రీ శక్తి సంగమం' పేరిట వివిధ రంగాలకు చెందిన కనీసం 2 లక్షల మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిసూర్‌లో జనవరి 2న నిర్వహించనున్న ఈ సభకు ప్రధాని మోడీ  ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహిళా లోకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్‌ తెలిపారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయినులు, ఆశావర్కర్లు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ తదితర రంగాలకు చెందిన మహిళలంతా ఈ సభకు హాజరుకానున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మహిళలందర్నీ ఒకే చోట చేర్చడం దేశంలో ఇదే తొలిసారి అని సురేంద్రన్‌ అన్నారు. అంతేకాకుండా బిల్లులకు ఆమోదముద్ర వేసినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని అభినందిస్తూ సభ ఏర్పాటు చేయడం ఇంత వరకు ఎక్కడా జరగలేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)