దేశంలో 5 కోట్లకు పైగా పెండింగ్‌ కేసులు !

Telugu Lo Computer
0


దేశంలోని వేర్వేరు కోర్టుల్లో మొత్తం 5 కోట్లకు పైనే కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో ఒక్క సుప్రీంకోర్టులోనే 80వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ గణాంకాలను వెల్లడించారు. డిసెంబర్‌ 1 నాటికి దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తంగా 5,08,85,856 పెండింగ్‌ కేసులు ఉండగా.. 61లక్షల కేసులు 25 హైకోర్టుల్లో వేర్వేరు స్థాయిల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లోనే అత్యధికంగా 4.46 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భారత న్యాయవ్యవస్థలో మొత్తంగా 26,568 మంది న్యాయమూర్తులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. సర్వోన్నత న్యాయస్థానంలో 34 మంది జడ్జిలు ఉండగా.. హైకోర్టుల్లో 1,114 మంది జడ్జిలు; జిల్లా, సబార్డినేట్‌కోర్టుల్లో 25,420 మంది జడ్జిలు ఉన్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)