27 రాత్రి 11 గంటలకు శబరిమల ఆలయం మూసివేత !

Telugu Lo Computer
0


బరిమల సన్నిధానం దేవాలయం తలుపులు ఈ సంవత్సరం మండల మహోత్సవం పూర్తయిన తర్వాత డిసెంబర్​ 27న రాత్రి 11:00 గంటలకు మూసివేస్తున్నారు. మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం తలుపులు డిసెంబర్​ 30న సాయంత్రం 5:00 గంటలకు తెరవబడతాయి. మకరవిళక్కు (జ్యోతి దర్శనం) జనవరి 15న సాయంత్రం (6:36:45) దర్శనం కలుగుతుంది. మకరవిళక్కు మహత్వష్టం పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానం 2024 జనవరి ​ 20న ఉదయం 6:30 మూసివేయబడుతుంది. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించరు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి ఏటా భారీగా భక్తులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది స్వామిని దర్శనం చేసుకోకుండానే తిరిగి ప్రయాణమయ్యారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచి భారీగా అయ్యప్పమాలధారులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దీంతో 41 రోజులపాటు ఆలయప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)