టీఆర్ఆర్టీసీ జీరో టికెట్లు జారీ విషయమై తనిఖీలు ?

Telugu Lo Computer
0


ప్లాట్ ఫామ్ వద్దకు బస్సు రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ బస్సులు ఎక్కుతున్నారు. క్షణాల్లో బస్సు నిండిపోతుంది. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 9 నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో బస్సులు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. తమ డిపోలో 97%, 100% ఆక్యూపెన్సీ రేషియో నమోదవుతుందని కొందరు డిపో మేనేజర్లు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఓఆర్ ఎలా పెరిగిందని సందేహాలు వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు మహిళలకు జారీ చేసే టికెట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కొందరు కండక్టర్లు, బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల కంటే ఎక్కువగా సంఖ్యలో జీరో టికెట్లు ప్రింట్ చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ తాండూరు మార్గంలో నడుస్తున్న బస్సులో కండక్టర్ తన టిమ్స్ నుంచి పెద్ద సంఖ్యలో జీరో టికెట్లను జారీ చేసి పడేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ఆర్టీసీ ఎండీ కార్యాలయం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఓఆర్ భారీగా పెరగడం, తాజా పరిణామాల నేపథ్యంలో టికెట్లు జారీ విషయమై తనిఖీలు చేయాలని యాజమాన్యం ఆదేశించింది. ఆర్టీసీ లాభ నష్టాల్లో ప్రతి కిలోమీటర్ కు వచ్చే ఆదాయం ఎర్న్ పర్ కిలోమీటర్ ఈపీకే కీలకం. ముఖ్యంగా కండక్టర్ పనితీరులో ఈపీకే ప్రామాణికం. సంస్థకు కండక్లరు ఎంత ఆదాయం తెచ్చిపెట్టారు అన్న లెక్కలను ఇదే ఆధారం. భవిష్యత్తులో కండక్టర్లుకు ఇచ్చే ప్రోత్సాహకాలకు ట్రాక్ రికార్డుకు ఇదే ఈపేకే నే ప్రామాణికం. ఇలా ఉద్యోగ పరంగా కలిగే భవిష్యత్తు ప్రయోజనాల కోసం కొందరు కండక్టర్లు ఇలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)