బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. బంగాళాఖాతం గగనతలంపై ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 15, 16వ తేదీల నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి అనువైన వాతావరణం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)