గెలుపు కోసం ఫకీరుతో చెప్పుతో కొట్టించుకున్న కాంగ్రెస్ నేత !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి పరాస్ సక్లేచా ఒక ఫకీర్ బాబా దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్లారు. అతడికి తన చేతితోనే కొత్త చెప్పులు ఇచ్చి, వాటి చేతనే దెబ్బలు తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రత్లాం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పరాస్.. ఫకీర్ బాబాకు చెప్పులు బహుమతిగా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు. ఆ తర్వాత ఆయనను ఫకీర్ బాబా అదే చెప్పులతో కొట్టడం కూడా చూడొచ్చు. ఫకీర్ బాబా దీవెనలు అందించే తీరు అద్వితీయమని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. బాబా తీరు, ఆయన ఆశీస్సులు ఎంత ఫలిస్తాయనే చర్చల్లో పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఈ బాబా ఆశీస్సులు పొందేందుకు క్యూ కడతారని అంటున్నారు. బాబా నగర శివార్లలోని మోవ్ రోడ్‌లో రోడ్డు పక్కన ఒక స్టూల్‌పై కూర్చుని, ఈ ప్రత్యేకమైన శైలిలో అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఫకీర్ బాబా చేతిలో దెబ్బలు తినాలని తహతహలాడుతుంటార. ప్రముఖులు, డబ్బున్న వారు కూడా ఇక్కడికి వస్తుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)