అకారణం యువకునిపై బీజేపీ దుండగుల దాడి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 6 November 2023

అకారణం యువకునిపై బీజేపీ దుండగుల దాడి !


త్తరప్రదేశ్ లోని కుద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్మాపూర్ లో బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఓ యువకుడిపై కర్రలు, రాడ్ లతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. యువకుడు వెళ్తున్న మార్గ మధ్యలో చుట్టుముట్టకి కిరాతకంగా కొట్టడం తోపాటు పిస్టల్ చూపి కాల్చి చంపుతామని బెదిరించారు. తనపై ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పమని బాధితుడు వేడుకున్నప్పటికీ దుండగులు అతని మాట వినలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రెండు నెలల కిందట జరిగిందని, బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. ఎస్పీ ఆదేశా ల మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.  బాధితుడు భగవాన్ పూర్ ప్రాంతానికి చెందిన సత్యం శర్మగా గుర్తించారు. కుద్వార్ నుంచి బైక్ పై మార్కెట్ కు వెళ్తుండగా నిందితులు శర్మపై దాడి చేశారు. దాడి చేసిన వారిని దేవల్ పూర్ కు చెందిన గౌరవ సింగ్, ఉజ్వల్ సింగ్, శుభమ్ సింగ్, నౌగ్వంతర్ కు చెందిన విపిన్ సింగ్, బీజేపీ మండల ఇంన్ ఛార్జ్ అవధేష్ శర్మ, భగవాన్ పనూర్ నివాసి ఆదిత్య శర్మగా గుర్తించారు. ఉత్మాపూర్ లోని ఓ ఇటుక బట్టీ దగ్గర కాపలా కాసి దాడి చేశారని బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. కర్రలు, రాడ్ లతో దాడి చేసి దారుణంగా కొట్టారని, తుపాకీ చూపించి చంపేస్తామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. రాజ్ వంత్ సింగ్ అనే మరో నిందితుడు తన మొబైల్ ఫోన్ లో రికార్డఉ చేసి ఆ వీడియోను ఇంటర్నెట్ వైరల్ చేశాడని బాధితుడు పోలీసులు తెలిపాడు. సెప్టెంబర్ 2 న దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించానని బాధితుడు తెలిపాడు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని.. దీంతో ఎస్పీని ఆశ్రయించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బాధితుడు తెలిపాడు. ఎస్పీ ప్రమేయంతో పోలీసులు కేసు నమోదు చేశాడు. ఈ వీడియో మీడియోలో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ వీడియాపై దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో దోషులను పట్టుకుంటానమి ఎస్పీ హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment