రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 8 November 2023

రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం

                                    

త్తీస్‌గఢ్‌లో ఎన్నికల విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు. కేశ్కల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బహిగావ్‌ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కొండగాన్‌ జిల్లా కేంద్రంలో ఈవిఎంలు అప్పగించి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యువి వాహనం కొండగాన్‌ జిల్లాలో ఓ ట్రక్కుని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందగా, ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయని అన్నారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించగా  చికిత్సపొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .

No comments:

Post a Comment