మహిళల గురించి ఆలోచించే పద్ధతి ఇదేనా ?

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లోని గుణాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడం దేశాన్ని అవమానించడమే అని అన్నారు. '' ఇండియా కూటమిలో ఒక పెద్ద నాయకుడు (నితీష్ కుమార్) అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించాడు. వారికి సిగ్గులేదు. ఇండియా కూటమిలోని ఏ నాయకుడు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. మహిళల గురించి ఆలోచించే పద్దతి ఇదేనా ? వారు మీకు మంచి చేయగలారా ?'' అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవారు మన దేశాన్ని అవమానిస్తున్నారు. మీరు ఎంత దిగజారిపోతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న బీహార్ అసెంబ్లీలో కులగణనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న సమయంలో సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ గురించి ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో సంతానోత్పత్తి రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని, లైంగిక సంపర్కం సమయంలో స్త్రీకి తమ భర్తలను ఎలా నిరోధించాలో వివరించారు. భర్తలు చేసిన చర్యలు మరన్ని జననాలకు దారి తీశాయని, అయితే చదువుకున్న మహిళలకు తమ భర్తలను ఎలా అడ్డుకోవాలో తెలుసని, అందుకే జననాలు తగ్గాయని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం వివాదంగా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది జేడీయూ అసలు స్వరూపమని, 70 ఏళ్ల నితీష్ కుమార్ ని అడాల్ట్ పురుగులు కుట్టాయని విమర్శించింది. జాతీయ మహిళా కమిషన్ కూడా నితీష్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)