వనిత విజయ్ కుమార్ పై దాడి !

Telugu Lo Computer
0


బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా వెళ్లి బయటకి వచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్ కి యూట్యూబ్ లో రివ్యూస్ చేసే వనిత విజయ్ కుమార్ గత రాత్రి ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాకా… రివ్యూ చెప్పి… డిన్నర్ చేసి అర్ధరాత్రి ఒంటి గంటకి కార్ పార్కింగ్ వైపు వాకింగ్ చేస్తుంటే… ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 'రెడ్ కార్డ్' ఇస్తారా అంటూ దాడి చేసాడట. ఈ విషయాన్నీ వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో గాయాలైన తన ఫోటోతో సహా పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ కొంతమంది, ఇందులో నిజం లేదు అంటూ మరికొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. మరి వనిత విజయ్ కుమార్ పోలీసులకి కంప్లైంట్ చేస్తుందో లేదో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)