వ్యక్తిగత రుణాలపై ఆర్బీఐ కొత్త రూల్స్ !

Telugu Lo Computer
0


తంలో క్రెడిట్‌ స్కోరు మంచిగా ఉంటె బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఆ రుణాలకు ఏడాది పాటు సక్రమంగా డబ్బును చెల్లిస్తే ఆపై ఎక్కువ మొత్తంలో రుణాలను అందించాయి. దీనితో రుణాలు తీసుకున్న చాలామంది తిరిగి రుణాన్ని చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వ్యక్తిగత రుణాలపై కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అప్పులు దొరకడం కష్టంగా మారనుంది. ఒకప్పుడు తీసుకున్న లోన్ అమౌంట్ ను సక్రమంగా ఏడాది చెలించగానే, టాపప్‌ రుణం ఇస్తామని, అదనంగా వ్యక్తిగత రుణం ఇస్తామంటూ ముందుకు వచ్చే బ్యాంకులు, ఇకపై అధిక వడ్డీ తో వ్యక్తిగత, టాపప్‌ రుణాలను అందించడం ప్రారంభించాయి. దీనితో గతంతో పోలిస్తే కొత్తగా వ్యక్తిగత రుణాలను పొందడం కష్టంగా మారింది. దీనికి కారణం రుణాలను అందించేందుకు బ్యాంకులకు అదనపు మూలధనం కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచడం మినహా బ్యాంకులకు ప్రత్యామ్నాయం లేదు. అయితే ఇప్పుడు కొన్ని బ్యాంకులు 10-26 శాతం వడ్డీకి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి. ఇందుకు రుణం తీసుకునే వ్యక్తికి నెలకు రూ.30 వేలు ఆదాయం ఉన్న సరిపోతుంది. అయితే ఇదంతా ఒకపుడు. ఇప్పుడున్నా పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ మారేందుకు ఆస్కారం ఉంది. క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు విషయంలోనూ కొన్ని మార్పులు రానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)