పొగాకు ఉత్పత్తులపై భారీగా హెల్త్ ట్యాక్స్ పెంపు ?

Telugu Lo Computer
0


సిగరెట్లతోపాటు బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై హెల్త్ ట్యాక్స్ పెంచాలని కేంద్రం ఆలోచనలో ఉందట!. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పొగాకు ఉత్పత్తి, తయారీ కంపెనీల నుంచి పెద్దగా పన్నులు రావటం లేదట. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో రాబడి లేకపోవటంతో హెల్త్ ట్యాక్స్ విధించాలనే కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందట!. ఇప్పటికే సిగరెట్ల ధరలు భారీగానే ఉన్నాయి. సిగరెట్లపై 49 శాతం, బీడీలపై 22 శాతం, పొగ లేని పొగాకు ఉత్పత్తులపై 63 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. అంటే 20 రూపాయల సిగరెట్ పై 10 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. జీఎస్టీ పెంచిన తర్వాత ఆరేళ్లలోనే సిగరెట్ల ధరలు 75 శాతం పెరిగాయి. అయినా కూడా కేంద్రానికి ఆదాయం రావటం లేదట. దీంతో హెల్త్ ట్యాక్స్ కూడా విధించటం ద్వారా ధరలు మరింత పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. కాగా కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని పబ్లిక్ హెల్త్ గ్రూప్స్ వెల్లడించాయి. కేంద్రం సిగరెట్ల ధరలు పెంచటం ద్వారా వినియోగదారులను ఆ అలవాటు నుంచి దూరం చేయవచ్చనే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు ఉత్పత్తులపై 75 శాతం పన్నులు విధించాలనే సూచన ఉంది. ఈ రిపోర్టును మాత్రం పరిగణలోకి సిగరెట్ ధరలు భారీగా పెరగటం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)