దీపావళి వేడుకల్లో ఖలిస్తానీ నినాదాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 14 November 2023

దీపావళి వేడుకల్లో ఖలిస్తానీ నినాదాలు !


కెనడాలోని బ్రాంప్టన్‌లో దీపావళి వేడకలు సందర్భంగా ఖలిస్తానీ మద్దతుదారుల గుంపు హిందువులతో ఘర్షణకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్తానీ జెండాలను మోసుకెళ్తున్న గుంపు, కొన్ని వస్తువులను తీసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న హిందూలపై విసిరినట్లు వీడియోలో ఉంది. ఈ సంఘటన మాల్టన్ లోని వెస్ట్‌వుడ్ మాల్‌లో జరిగింది. వీడియోలో పోలీసులు జనాలను వెనక్కి వెళ్లమని చెప్పడం కనిపిస్తుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హింస, ప్రార్థనా స్థలాలు, మైనారిటీలపై జాతిపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలను ప్రేరేపించడం కోసం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని కెనడాకు భారత్ చెప్పిన  వారం రోజుల తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. 

No comments:

Post a Comment