ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday 14 November 2023

ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ !

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై గురువారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే తగిన చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. "ఆప్ తన అధికారిక హ్యాండిల్ నుండి ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధినేత గురించి చాలా అనైతికమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోధయోగ్యం కావు" అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనైతిక వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఆప్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్‌లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది.

No comments:

Post a Comment