దీపావళి రోజు 4 లక్షల కోట్ల వ్యాపారం !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఫుల్ జోష్ గా జరిగాయి. ఈ దీపావళి పండుగకు కూడా జనం కోట్ల రూపాయల పటాకులను కాల్చేశారు. ఈ ఏడాది దీపావళికి ఏకంగా రూ.3.75 లక్షల కోట్ల సేల్స్‌ జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్ మంగళవారం వెల్లడించారు. దీపావళి షాపింగ్‌తో దేశవ్యాప్తంగా మార్కెట్‌ల రికార్డులు బద్ధలయ్యాయి. మొత్తం రూ.3.75 లక్షల కోట్ల దీపావళి సేల్స్‌లో జనం 13% ఆహారం, కిరాణం కోసం, 9% ఆభరణాల కోసం, 12% వస్త్రాల కోసం, 4% డ్రై ఫ్రూట్స్ కోసం, 4% స్వీట్ల కోసం ఖర్చుపెట్టారట. మిగిలిన 20% ఆటోమొబైల్స్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులపై ఖర్చు చేశారని నివేదికలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)