కేదార్‌నాథ్‌లో రాహుల్‌, వరుణ్‌గాంధీ పలకరింపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 8 November 2023

కేదార్‌నాథ్‌లో రాహుల్‌, వరుణ్‌గాంధీ పలకరింపు !


కేదార్‌నాథ్‌లో అన్నదమ్ముళ్లైన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ఒకేచోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందినా ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ గత మూడురోజులుగా ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. పర్యటన ముగింపు నేపథ్యంలో కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఎదురుపడగా పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరుణ్‌ గాంధీ కుమార్తెను చూసిన రాహుల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలే ఏవీ చర్చకు రాలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాహుల్‌ గాంధీ రాజీవ్‌ గాంధీ కొడుకు కాగా, వరుణ్‌గాంధీ సంజయ్‌ గాంధీ తనయుడు. వరుణ్‌ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీ బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు చట్టాలు, బీజేపీ వ్యవహరించిన తీరుపై వరుణ్‌ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బీజేపీత వరుణ్‌కు పొసడం లేదనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీకి విలేకరుల సమావేశంలో వరుణ్‌ గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన రాహుల్‌ సోదరుడిని కలిసి ఆలింగనం చేసుకుంటానని.. కానీ ఆయన సిద్ధాంతం (ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ భావజాలం) ఎన్నడూ సమర్థించనని పేర్కొన్నారు. తాజాగా ఇద్దరు ముఖాముఖిగా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

No comments:

Post a Comment