60 మద్యం సీసాలను తాగేసిన ఎలుకలు పట్టుకున్న పోలీసులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 8 November 2023

60 మద్యం సీసాలను తాగేసిన ఎలుకలు పట్టుకున్న పోలీసులు !


ధ్యప్రదేశ్‌లోని చింద్వారా కొత్వాలిలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి సమయంలో పట్టుబడిన మద్యాన్ని ఎలుకలు తాగేశాయి. ఇక ఎలుకలను పట్టుకునేందుకు పోలీస్ స్టేషన్‌లో బోను ఏర్పాటు చేయగా, అందులో ఒక ఎలుక చిక్కుకుంది. ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చింద్వారా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో 60 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆవరణలోని కచ్చా భవనంలో నిర్మించిన గోదాములో ఉంచారు. చింద్వారా కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమేష్ గోల్హానీ తెలిపిన వివరాల ప్రకారం.. ''ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వచ్చాయి. కచ్చా భవనం కావడంతో రోజూ ఇలాంటి సమస్యలు స్థానిక పోలీసుల కళ్ల పడుతూనే ఉంటాయి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి సరఫరా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. అయితే వాటిని పోలీస్ స్టేషన్ లో పెట్టగా, వాటిని ఎలుకలు తాగేశాయి'' అని ఆయన చెప్పారు.


No comments:

Post a Comment