అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని తుమకూరులోని సదాశివనగర్‌లో నివాసం ఉంటున్నఐదుగురు కుటుంబం సభ్యులు శవమై కనిపించారు. భార్యాభర్తలు వారి ముగ్గురు పిల్లలను హత్య చేసి తరువాత వాళ్లు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.డెత్ నోట్‌ను గుర్తించిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. మృతులను గరీబ్ సాబ్ (42), సుమయ్య (35), వారి పిల్లలు హజీరా (14), సుభాన్ (10), మునీర్ (8)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం గరీబ్ సాబ్, అతని భార్య తమ ముగ్గురు పిల్లలను చంపిన తర్వాత వెంటనే దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుందని తెలిసింది. ఆత్మహత్యకు ముందు గరీబ్ సాబ్ ఓ వీడియో తీసి అతని బంధువులకు పంపించాడు. గరీబ్ సాబ్, సుమయ్య దంపతులు రెండు పేజీల డెత్ నోట్ కూడా రాశారు. అందులో తమ చావులకు కారణం తన పొరుగున నివాసం ఉండేవాళ్లు, అప్పులు ఇచ్చిన వాళ్లు అని రాశారని పోలీసులు అన్నారు. ఒక వీడియోలో గరీబ్ సాబ్ తన పొరుగున వున్న వారిలో నలుగురు  వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మా ఆత్మహత్యలకు వాళ్లే కారణం అని గరీబ్ సాబ్ వీడియోలో ఆరోపించారు. బాధితులు కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్‌కు లేఖ రాసి మా ఆత్మహత్యలకు కారణం అయిన వారి మీద కఠిన చర్చలు తీసుకోవాలని కోరారు. ఇంటి యజమాని గరీబ్ సాబ్ ఓ సంస్థ నుంచి రూ1. 50 లక్షల రూపాయల రుణం తీసుకుని సరైన సమయంలో తిరిగి చెల్లించలేకపోయాడు.నివాసం ఉంటున్న ప్రాతంలోనే అతను కబాబ్ దుకాణం నిర్వహించేవాడు. డెత్ నోట్ ఆధారంగా తుమకూరు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తుమకూరు జిల్లాలోని సిరా తాలూకాలోని లక్కనహళ్లికి చెందిన గరీబ్ సాబ్ తన పిల్లల చదువుల కోసం తుమకూరు టౌన్ చేరుకుని అక్కడే నివాసం ఉంటూ కబాబ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. తుమకూరు జిల్లా ఎస్పీ అశోక్ కేవీ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించి డెత్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. తిలక్ పార్క్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకే ఫ్యామిలీలో ఐదుగురు కుటుంబ సభ్యులు శవమై కనిపించారని ఆదివారం రాత్రి తమకు సమాచారం అందిందని, అక్కడికి పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే అందరూ చనిపోయి ఉన్నారని జిల్లా ఎస్పీ ఆశోక్ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)