ముంబై, హైదరాబాద్ ఆఫ్ఘన్ కాన్సులేట్లు తిరిగి ప్రారంభం !

Telugu Lo Computer
0


ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్ వెల్లడించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం, భారతదేశంలోని కాన్సులేట్లు, మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని స్టానిక్‌జాయ్ పేర్కొన్నారు. నయూమీ అనే వ్యక్తి భారత్ లోని దౌత్య కార్యాలయాలు మూసివేయబడ్డాయని, సేవలు అందించడం లేదని చెప్పాడు, అతని వాదనలు తప్పని తాలిబాన్లు స్పష్టం చేశారు. నవంబర్ 23 నాటికి భారత్‌లో ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు ఎవరూ లేరని, ఆ దేశ ఎంబసీ నవంబర్ 25న తెలిపింది. అయితే ఆ సమయంలో భారత విదేశాంగ శాఖ ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ లోని పౌర ప్రభుత్వాన్ని దించేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ మానవతా సాయం కింద ఆఫ్ఘన్లకు మెడిసిన్స్, గోధుమలు వంటి వాటిని భారత్ పంపిస్తోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనే విషయంలో ఐక్యరాజ్యసమితి మార్గనిర్దేశాన్ని అనుసరిస్తామని భారత్ తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)