నాసిక్‌ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 17 November 2023

నాసిక్‌ వీధుల్లో పట్టపగలే చిరుతల సంచారం !


హారాష్ట్ర లోని  నాసిక్‌ లో శుక్రవారం రెండు చిరుత పులుల సంచారం తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే నగరంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. సవాతా నగర్‌ ప్రాంతంలో ఓ చిరుత సంచారాన్ని ప్రజలు ముందుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గోవింద్‌ నగర్‌లో మరో చిరుత స్థానికుల కంటపడింది. రెండు చిరుతలూ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇరుకైన వీధుల్లో సంచరిస్తూ ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ప్రజలను హడలెత్తించాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని రెండు చిరుతల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు శ్రమించి వాటిని పట్టుకున్నారు. కాగా, చిరుతల సంచారానికి సంబందించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

No comments:

Post a Comment