నేషనల్ హెరాల్డ్ కేసులో 752కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు !

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, వాయినాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి చెందిన 752కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని రూ. 752 కోట్ల ఆస్తులను ఈరోజు ఈడీ జప్తు చేసింది. కాగా ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ మరోసారి ఈ కేసు తెరపైకి రావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈడీ అటాచ్ ఆస్తులు చూస్ సోనియా , రాహుల్ లకు సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తులు… ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ లు అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎంఎల్ఏ 2002 కింద దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా అటాచ్ చేయాలని ఈడీ ఉత్తర్వులను జారీ చేసింది. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు ఇండియాలోని అనేక నగరాల్లోని రూ.661.69 కోట్ల విలువైన స్థిరాస్తులను, ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో ఉన్న రూ. 90.21 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)